లాక్‌డౌన్ సమయంలో వచ్చిన కరెంట్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర భాజపా నేతలు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలన్నారు. విద్యుత్ బకాయిలను మాఫీ చేసి పేద, మధ్య తరగతి వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డిని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కలిశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినతిపత్రం సమర్పించారు.
'విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి' - telangana current charges latest news
లాక్‌డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. కరెంట్ ఛార్జీలు పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా ఉన్నాయని అన్నారు. ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డిని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కలిశారు.

bjp
మూడు నెలల లాక్‌డౌన్ సమయంలో రూ.500 కరెంట్ బిల్లు ఏకంగా రూ.12 వేలకు పెరిగిందని వారు ఆక్షేపించారు. బాధితులే స్వయంగా తమని కలిసి గోడు చెప్పుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు వివరిద్దామనుకుంటే సమయం ఇవ్వడంలేదని విమర్శించారు.
'విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి'