జీహెచ్‌ఎంసీలో గెలుపుపై వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి... మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఈసీ ప్రభుత్వానికి దాసోహంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ విషయంలో తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరాస అడుగులకు ఎస్‌ఈసీ మడుగులు: భాజపా
జీహెచ్ఎంసీ ఫలితాలపై వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని భాజపా నేతలు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.
తెరాస కార్పొరేటర్లు ఎక్కువగా గెలవనందుకే ఎస్‌ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అడిగితే ఇంకా సమయం ఉందని... నెల ముందుగా ఇస్తామంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారని నిలదీశారు. ఎస్‌ఈసీ... తెరాస అడుగులకు మడుగులు ఒత్తుతోందని ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేయడంతో పాటు గవర్నర్‌ను కలుస్తామన్నారు. ఎంఐఎంతో కలిసి ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని చింతల విమర్శించారు.
ఇదీ చూడండి:టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం.. బీజేవైఎం ఆందోళన