'పేదలకు వైద్యం అందించడంలో కేసీఆర్ విఫలం' - bjp leaders inspected vanastalipuram area hospital in hyderabad
తెరాస ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమైందని భాజపా నేత సామ రంగారెడ్డి అన్నారు.

'పేదలకు వైద్యం అందించడంలో కేసీఆర్ విఫలం'
పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని భాజపా నాయకులు సామ రంగారెడ్డి అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఎక్స్రే మిషన్ పాడై మూడేళ్లయినా... వాటిని బాగుచేయించలేదని, 100 పడకల ఆస్పత్రిలో 150 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో తెరాస ప్రభుత్వం ఉందన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆర్ఎంఓకు సూచించారు.
'పేదలకు వైద్యం అందించడంలో కేసీఆర్ విఫలం'
- ఇదీ చూడండి : మహా విషాదం: సైన్యంలో చేరాల్సిన 10మంది మృతి