విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరిది తప్పుడు ప్రచారం. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదు. ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది. పార్లమెంట్లో పనిచేయకుండా మమ్మల్ని అడ్డుకున్నారు.కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టాం. - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన తనకు.. పార్టీ అనేక బాధ్యతలు అప్పగించిందన్నారు. గతంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా పని చేశానని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్ 370 అంశంపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆర్టికల్ 370 కోసం పోరాడుతూ నాటి పార్టీ అధ్యక్షుడు బలిదానమయ్యారని అన్నారు.
కశ్మీర్ కోసం పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని హామీ ఇచ్చాం. ఆర్టికల్ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగం.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని భాజపా అమలు చేస్తోంది. జిన్నా తీసుకువచ్చిన ఆర్టికల్‌ను కాంగ్రెస్ అమలు చేసి కశ్మీర్ ప్రజలను బలిచేసింది. అందుకే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. -కిషన్ రెడ్డి ,కేంద్ర మంత్రి
అందరికి వ్యాక్సిన్లు