ప్రధానిగా మోదీ ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా.. సికింద్రాబాద్ సీతాఫల్మండి భాజపా కార్యాలయంలో వికలాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మోదీ చర్యలు తీసుకుంటున్నారని భాజపా సీనియర్ నేత సతీశ్ కొనియాడారు. ప్రధాని చర్యలతోనే దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోందని అన్నారు.
భాజపా ఆధ్వర్యంలో వికలాంగులకు నిత్యావసరాలు - హైదరాబాద్ వార్తలు
ప్రధానిగా మోదీ ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా.. సికింద్రాబాద్ సీతాఫల్మండి భాజపా కార్యాలయంలో వికలాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడానికి మోదీ తీసుకుంటున్న చర్యలే కారణమని భాజపా నేతలు అన్నారు.
![భాజపా ఆధ్వర్యంలో వికలాంగులకు నిత్యావసరాలు telangana news, bjp leader, groceries to handicapped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:55:39:1622370339-11955044-bjp.jpg)
తెలంగాణ వార్తలు, భాజపా నేతలు, వికలాంగులకు నిత్యావసరాలు
లాక్డౌన్, కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారు ఆకలితో అలమటించకూడదని సేవాహి సంఘటన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు, సీనియర్ నాయకుడు నాగేశ్వర్ రెడ్డి, కనకంట్ల హరి, వెంకటేశ్ గౌడ్, మహేశ్ సెట్, రవీందర్, అజయ్ నాయుడు, దిలీప్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.