ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఓటు వేసిందని లేఖలో వెల్లడించింది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో... బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు తెలిపిందని భాజపా పేర్కొంది.
'ఓటేసిన ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలి' - కవితపై భాజపా నేతల ఫిర్యాదు
ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని భాజపా నేతలు సీఈసీకి లేఖ రాశారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు తెలిపి... మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేయటాన్ని తీవ్రంగా ఖండించారు.
!['ఓటేసిన ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలి' bjp leaders complaint on mlc kavitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9739821-878-9739821-1606910834897.jpg)
bjp leaders complaint on mlc kavitha
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకుందని భాజపా నేతలు లేఖలో పేర్కొన్నారు. "నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను... మీరూ బయటకు వచ్చి ఓటు వేయండి" అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.