గ్రేటర్ హైదరాబాద్ పోరులో మేయర్ పీఠమే లక్ష్యంగా భాజపా ప్రచార జోరు పెంచింది. విజేతలుగా నిలవాలని భాజపా అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డివిజిన్ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గోషామహల్ డివిజన్ భాజపా అభ్యర్థి లాల్‌సింగ్... ఇంటింటి ప్రచారం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్ డివిజన్లలో ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు. భాజపా అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మల్లేపల్లి అభ్యర్థి... ఉష శ్రీతో కలిసి .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. మాంగార్‌బస్తీ, బోయగూడ, సీతారాంబాగ్ ప్రాంతాల్లో చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మేయర్ పీఠం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రేటర్ పోరు: పీఠమే లక్ష్యంగా బస్తీల్లో కమల ముమ్మర ప్రచారం - ghmc elections 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా ప్రచారం ముమ్మరం చేసింది. డివిజన్లలో గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు... అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తున్నారు. భాగ్యనగరంలో మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి తెరాస కొమ్ముకాస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సనత్‌నగర్, అమీర్‌పేట్ డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. రామచంద్రాపురం డివిజన్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని... భాజపా అభ్యర్థి నరసింహగౌడ్ తెలిపారు. డివిజన్‌వాసులు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఓటేసి గెలిపిస్తే భారతినగర్‌లో సమస్యలు పరిష్కరిస్తామని భాజపా అభ్యర్థి గోదావరి పేర్కొన్నారు.
అడ్డగుట్ట డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో భాజపా అభ్యర్థి మంద అశ్విని ఓటర్ల చెంతకు వెళ్లారు. తెరాస సర్కారు వైఫల్యాలను వివరించి ఓట్లడిగారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్ మండి అభ్యర్థులకు మద్దతుగా భాజపా బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ప్రచారంలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు పరిష్కారం కావాలంటే భాజపాకు పట్టం కట్టాలని భాజపా శ్రేణులు ఓటర్లను విజ్ఞప్తి చేశారు.