ముఖ్యమంత్రి కేసీఆర్ పోతిరెడ్డిపాడు అంశంపై ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా నీళ్ల దోపిడి చేస్తున్నాడని దుయ్యబట్టారు. కమిషన్ల విషయంలో ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని ఆరోపించారు.
మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులు రద్దు చేయాలి: వివేక్
సీఎం కేసీఆర్కు రాష్ట్రంపై ప్రేమ ఉంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ను నిలదీయాలని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. కమిషన్ల విషయంలో ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని ఆరోపించారు.
మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులు రద్దు చేయాలి: వివేక్
మెగా కృష్ణారెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైన 12వేల కోట్ల బిల్లు తీసుకున్న తరువాత కేసీఆర్ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.