మజ్లిస్ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని భాజపా ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్లో ఆరోపించారు. కేసీఆర్తో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తరువాతనే జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టారని తెలిపారు. పాలనాపరమైన నిర్ణయాలు దారుసలేంలో ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎంఐఎంకు కావల్సిన విధంగా తెరాస సహకరిస్తుందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
'మజ్లిస్ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్ పాలన' - bjp leader nvss prabhakar fire on mim leaders
ఎంఐఎం- తెరాసలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యహరిస్తున్నారని భాజపా ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై పెట్టిన కేసులను నిరుగార్చే విధంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.
'మజ్లీస్ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్ పాలన'
ఎంఐఎం- తెరాసలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యహరిస్తున్నారని ఆక్షేపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై పెట్టిన కేసులను నిరుగార్చే విధంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఛార్జ్షీట్స్ వేయకుండా... సాక్షులను ప్రవేశ పెట్టకుండా... ప్రభుత్వమే కేసును నిరుగారుస్తుందని ప్రభాకర్ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: టపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
TAGGED:
ghmc elections update