బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణలో భాజపాను ముందుకు నడిపిస్తామని ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా పోరాడుతోందన్నారు.
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం: లక్ష్మణ్ - laxman satires on congress
బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో భాజపాను ముందుకు నడిపిస్తామని ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామన్న ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
![గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం: లక్ష్మణ్ bjp laxman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6419928-42-6419928-1584279781156.jpg)
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తాం: లక్ష్మణ్
తెరాసను తండ్రీ కుమారుల పార్టీగా.. కాంగ్రెస్ను తల్లీ కుమారుల పార్టీగా లక్ష్మణ్ అభివర్ణించారు. సామాన్య కార్యకర్తలు కూడా జాతీయస్థాయి నాయకులుగా ఎదిగిన పార్టీ భాజపా మాత్రమేన్నారు. రాష్ట్రంలో ఓవైసీ అజెండాను తెరాస నేతలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తాం: లక్ష్మణ్