ఇక తెరాసకు నిద్రలేని రాత్రులే..! : లక్ష్మణ్
కేటీఆర్ తన స్థాయిని మరచి ఆరోపణలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అవినీతిమయమైందన్న లక్ష్మణ్.. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
తెరాస గారడీలు ఇక సాగవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నాటి సభలో చేరికలు చూసి తెరాస నేతలకు పీఠాలు కదిలిపోతున్నాయన్నారు. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్లుగా.. కేటీఆర్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. నెలకోసారి కేంద్ర మంత్రి అమిత్షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ వస్తారని తెలిపారు. ఇక తెరాస నేతలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం అవినీతిమయమైందన్న లక్ష్మణ్.. విద్యుత్ టెండర్లు, సాగునీటి ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపిస్తే తగిన ఆధారాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్