bjp leader laxman: రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు అవినీతికి, కులానికి, ఒకే కుటుంబానికి పరిమితమయ్యాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
bjp leader laxman: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాదే అధికారం: లక్ష్మణ్ - ఆ పార్టీలు కులానికి, కుటుంబానికే పరిమితమయ్యాయి
bjp leader laxman: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆపార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు అవినీతికి, కులానికి, ఒకే కుటుంబానికి పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు.

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే.. అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ తుడిచిపెట్టుకుపోయిందని లక్ష్మణ్ అన్నారు.
ఇదీ చదవండి:పాఠశాల స్థాయిలోనే ఎదుటివారి పట్ల దయను కలిగి ఉండేలా నేర్పించాలి: కిషన్ రెడ్డి