'కేసీఆర్ బలం, బలహీనత, భయం.. అన్ని నాకు మాత్రమే తెలుసు..' Etela rajender Comments: సీఎం కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మి.. మతి భ్రమించి మాట్లాడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌కు కావాల్సింది బానిసలని.. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. కేసీఆర్ ఏ పథకం తెచ్చినా.. ఆయన బంధువులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆక్షేపించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే కేసీఆర్‌కు ఉండదన్నారు.
హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని.. ఓటుకు నోటు ఇచ్చారన్నారు. కేసీఆర్ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు, భయం అన్నీ తనకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని.. నాయకులు కాదని ఈటల స్పష్టం చేశారు.
"కేసీఆర్ దగ్గర లక్షల కొద్ది డబ్బులు జమయ్యాయి. కేసీఆర్ నన్ను టార్గెట్ చేశారు. బెంజ్ కార్లు ఉన్నవారికి రైతు బంధు ఇస్తున్నారు. ఇటువంటి వాటిపై ఆడిగినందుకే అందుకే నన్ను బయటికి పంపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటుకి నోటు ఇచ్చి కొనుగోలు చేశారు. కేసీఆర్ గురించి అన్నీ తెలిసిన వ్యక్తిని నేనే. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలకు పట్టిన శనిని వదిలించాలి. ఒక మైనార్టీని, దళితబిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాది. ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. నరేంద్రమోదీకి దేశ ప్రజలే కుటుంబసభ్యులు. కేసీఆర్ బాషా ప్రసంశనీయంగా ఉందా.. తెరాస మంత్రులు గుండె మీద చేతులు వేసుకుని చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్.. తప్పకుండా ఎన్నికలు పెడతారు. వర్షం పట్ల ఇబ్బందులపై ప్రెస్‌మీట్ పెడతారనుకున్నా. కానీ.. కుర్చీ కోసం పెట్టారు. వ్యక్తిగతంగా మాట్లాడితే ప్రజలు తన్ని తరిమేస్తారు. దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో చర్చకు రావాలి.. బూతు పురాణంతో కాదు." - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇవీ చూడండి: