జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. రెండు రోజులు జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టివిక్రమార్క... వాటి నాణ్యతపై మాట్లడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్నాయనే మంత్రి కేటీఆర్... హడావుడి విమర్శించారు.
'వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి కావొచ్చు!' - తెరాస, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు
తెరాస, కాంగ్రెస్ నేతల డబుల్ బెడ్ రూం ఇళ్ల పర్యటనపై భాజపా నేత డీకే అరుణ స్పందించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస కలిసి పోటీచేసేటట్లు ఉన్నాయన్నారు.
bjp leader dk aruna responded on congress,trs leaders double bed room houses visit
రాష్ట్రంలో భాజపా బలపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ను తెరాస పెంచిపోషిస్తోందని జూమ్ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో డీకే అరుణ ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోలేక కాంగ్రెస్, తెరాస కలిసి పోటీచేసేటట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రెండు పడక గదుల ఇళ్ల విషయంలో పేదలకు ఇచ్చిన హామీని తెరాస ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రెండు పడక గదుల ఇళ్లపై కాంగ్రెస్, తెరాస డ్రామాలను ఎండగడుతామన్నారు.