రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి పట్టభద్రులు సన్నద్ధం కావాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. టీఎస్‌పీఎస్సీ మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి 32 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామంటుంటే... షాడో సీఏం కేటీఆర్ లక్షా 32 వేల మందికి ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో ఏదీ నిజమని ప్రశ్నించారు. సింగరేణిలో ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలను కూడా కొత్త ఉద్యోగాల జాబితాలో కలిపారని హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో మండిపడ్డారు.
'భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు' - టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు చెబుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతుంటే... మంత్రి కేటీఆర్ మాత్రం లక్షా 32 వేల కొలువులు భర్తీ చేశామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
bjp leader dk aruna fire on minister ktr comments
ఖాళీలకు, కేటీఆర్ ప్రకటించిన లెక్కలకు అస్సలు పొంతన లేదని దుయ్యబట్టారు. ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసిన గంటా చక్రపాణికే... ఇప్పుడు కొలువు లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు.