సేవా హీ సంఘటన్ పేరుతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్ డెస్క్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. హెల్ప్ డెస్క్‌లో పనిచేస్తున్న కార్యకర్తలతో మాట్లాడి... వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్న వాలంటీర్లు సంజయ్‌కి వివరించారు.
కరోనా హెల్ప్ డెస్క్‌ను సందర్శించిన బండి సంజయ్ - బండి సంజయ్
హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్‌డెస్క్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. అపత్కాలంలో ఫోన్ చేస్తున్నవారికి సంయమనంతో సమాధానం ఇవ్వాలని డెస్క్‌లో పనిచేస్తున్న వాలంటీర్లకు సూచించారు.
bjp leader bandi sanjay visited corona help desk
అపత్కాలంలో ఫోన్ చేస్తున్నవారికి సంయమనంతో సమాధానం ఇస్తూ... తగిన విధంగా సహాయ, సహాకారాలు అందించాలని వాలంటీర్లకు బండి సంజయ్ సూచించారు.