తెలంగాణ

telangana

ETV Bharat / city

'పాతబస్తీలో సంఘవిద్రోహ శక్తులను 15 నిమిషాల్లో గుర్తించొచ్చు' - సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ ఆరోపణలు

సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ మండిపడ్డారు. గ్రేటర్​ ఎన్నికలు జరిగి ఇన్నిరోజులైనా... మేయర్​ను నియమించకపోవటమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులను కించపరిచేలా సీఎం కేసీఆర్​... స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. పాతబస్తీలో సంఘవిద్రోహ శక్తులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు దమ్ముందా అని సవాల్​ విసిరారు.

bjp leader bandi sanjay fire on cm kcr
bjp leader bandi sanjay fire on cm kcr

By

Published : Dec 24, 2020, 4:32 PM IST

'రోహింగ్యాలను గుర్తించటంలో తెరాస ప్రభుత్వం విఫలం'

హైదరాబాద్​ పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. నగరంలో అక్రమంగా ఉంటున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని బండి సంజయ్‌ డిమాండ్​ చేశారు. పాతబస్తీని పోలీసులకు 15 నిమిషాలు అప్పజెప్పితే... సంఘవిద్రోహ శక్తులను వెలికితీస్తారని... ఆ దమ్ము సీఎం కేసీఆర్​కు ఉందా అని సవాల్​ విసిరారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే సంఘవిద్రోహక శక్తులను అరెస్టు చేస్తారని హితవు పలికారు.

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు తెరాసకు చెందిన సాబాసు శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ... సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేట కార్పోరేషన్ ఎన్నికల వేళ తెరాస నేతలు భాజపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు గిరిజన మైనర్ బాలికలపై ఉపాధ్యాయుడు ఐదు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని...పోలీసులు చర్యలు తీసుకోకుండా తెరాస నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. దీనిపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. ఆ తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రేపట్నుంచి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ అవుతాయని ప్రకటించారు. కొత్త సాగు చట్టాల విషయంలో రైతులను కొన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు.

ఇదీ చూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!

ABOUT THE AUTHOR

...view details