ఉద్యోగులతో చర్చలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్... కాలం వెల్లబుచ్చుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో నిజమాబాద్ ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో చేరిన నేతలను ఆహ్వానించారు. ఉపాధ్యాయులు, పంచాయితీరాజ్‌లో పదోన్నతులు కల్పించట్లేదని బండి సంజయ్ విమర్శించారు.
భాజపా అధికారంలోకి రాగానే ఉద్యోగోన్నతులు: సంజయ్ - bjp joinings
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై సీఎం కేసీఆర్ తీరును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. కేవలం చర్చలతోనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే... పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు.
bjp leader bandi sanjay fire on cm kcr for promotions to employees
1990 నుంచి ఇప్పటివరకు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు లేవన్న సంజయ్... ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. 2023లో తామే అధికారంలోకి వస్తామని.... ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని బండి సంజయ్ తెలిపారు.