తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 7:20 PM IST

Updated : May 19, 2020, 8:13 PM IST

ETV Bharat / city

'కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారు'

ప్రపంచం మొత్తం మోదీని కొనియాడుతుంటే.. కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడతం భావ్యం కాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. పారాసిటమల్​తో కరోనా పోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్... కరోనాతో జీవించాలనడమేంటని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

laxman
laxman

ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంది... దేనికి ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్బీఎంను రాష్ట్రాల కోరిక మేరకే ప్రధాని మోదీ 3 నుంచి 5 శాతానికి పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని కేసీఆర్‌ అపహాస్యం చేసి మాట్లాడటం సరైందికాదన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని దూరదృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఫెడరల్ స్ఫూర్తి గురించి కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. రైతులు ప్రభుత్వం సూచించిన పంటనే వేసుకోవాలని లేనిపక్షంలో రైతుబంధు పథకం వర్తించదని ఎందుకు షరతులు విధించారో సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేస్తే మీ పెత్తనం ఏంటి. కాంట్రాక్టులు, కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారు. ఉత్పదక సామర్థ్యం పెంచడమే మోదీ లక్ష్యం.

- లక్ష్మణ్​, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

'కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారు'

ఇదీ చదవండి:కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా

Last Updated : May 19, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details