కాంగ్రెస్‌తో తెరాస లాలూచీ పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. తెరాసకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈనెల 17 న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 18న కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. దిల్లీలో ఇటీవల భాజపాలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ను భాజపా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. లక్ష్మణ్ సమక్షంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కాషాయ కండువా కప్పుకున్నారు.
తెరాసకు కౌంట్‌డౌన్ మొదలైంది: లక్ష్మణ్ - బంగారు తెలంగాణ
తెరాస, కాంగ్రెస్ పార్టీలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెరాసకు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ఈనెల 17 పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 18న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.
తెరాసకు కౌంట్‌డౌన్ మొదలైంది: లక్ష్మణ్