తెలంగాణ

telangana

ETV Bharat / city

వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తు: సీఈసీకి భాజపా-జనసేన ఫిర్యాదు - గాజుగుర్తు వ్యవహారం

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన గుర్తును మరో పార్టీకి కేటాయించటంపై భాజపా-జనసేన నేతల బృందం సీఈసీకి ఫిర్యాదు చేశాయి.

bjp-jana-sena-leaders-complaint-to-the-cec
వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై.. సీఈసీకి భాజపా - జనసేన ఫిర్యాదు

By

Published : Apr 5, 2021, 10:56 PM IST

కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా - జనసేన నేతల బృందం కలిసింది. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి ఉప ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై అభ్యంతరం తెలుపుతూ... సీఈసీకి ఫిర్యాదు చేసింది.

వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై.. సీఈసీకి భాజపా - జనసేన ఫిర్యాదు

కోడ్ అమల్లో ఉండగా..ప్రకటన ఎలా ఇస్తారు?: జీవీఎల్

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రకటనపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే పరిషత్‌ ఎన్నికల ప్రకటన ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పరిషత్‌ ఎన్నికల వేళ... తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. అన్ని అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

మరో పార్టీకి జనసేన గుర్తుపై ఫిర్యాదు: నాదెండ్ల

జనసేన గుర్తును తిరుపతి ఉప ఎన్నికల్లో మరో పార్టీకి ఇవ్వడంపై ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని మనోహర్‌ అన్నారు.

ఇదీ చదవండి :రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details