నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో... అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
బండి సంజయ్ అధ్యక్షతన భాజపా పదాధికారుల సమావేశం
దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై... భాజపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
బండి సంజయ్ అధ్యక్షతన భాజపా పదాధికారుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయడం, దుబ్బాక ఉప ఎన్నికల్లో ముఖ్య నేతలు సమన్వయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే అంశంపై సమాలోచనలు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని... ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి:'వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది'