కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఛైర్ పర్సన్ విమలక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులనూ భాజపా ప్రైవేటుపరం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం... ప్రైవేట్ సంస్థలకు దాసోహం అనటం దారుణమన్నారు.
భాజపా ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు దాసోహం: విమలక్క - Vimalakka Comments On BJP
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన కేంద్రం ప్రైవేట్ సంస్థలకు దాసోహం అంటోందని... అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఛైర్ పర్సన్ విమలక్క విమర్శించారు. ఏపీలోని కాకినాడ నగరంలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా మహాసభ జరిగింది. ఈ సభలో విమలక్క మాట్లాడారు.
![భాజపా ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు దాసోహం: విమలక్క భాజపా ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు దాసోహం: విమలక్క](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11131853-970-11131853-1616518803620.jpg)
భాజపా ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకు దాసోహం: విమలక్క
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని విమలక్క స్పష్టం చేశారు. ఏపీలోని కాకినాడలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా మహాసభకు హాజరైన విమలక్క... భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: 'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'