గ్రేటర్ పోరులో భాజపా-తెరాసలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచే జోరు సాగించిన భాజపా.. ఆ జోష్‌ను అలాగే కొనసాగించింది. గత ఎన్నికలో 4 స్థానాలు గెలుచుకున్న కాషాయం.. ఈ ఏడాది అత్యధికంగా 48 స్థానాలు కైవసం చేసుకుంది.
గ్రేటర్ ఫలితం : స్వల్ప ఆధిక్యంతో అత్యధిక స్థానాలు..
గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈసారి ఎన్నికలను తెరాస, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. ఫలితాల సరళి కూడా దీన్ని ప్రతిబింబించింది.
గ్రేటర్ పోరులో భాజపా-తెరాసల హోరాహోరీ పోరు
150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల స్వల్ప ఆధిక్యంతో అభ్యర్థులు గెలుపొందారు. తక్కువ ఆధిక్యంతో అత్యధిక స్థానాలను భాజపా గెల్చుకోగా.. సిట్టింగ్ స్థానాలను తెరాస చేజార్చుకుంది.