కార్యకర్తల త్యాగాల ఫలితంగానే భాజపా శక్తివంతంగా తయారైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం పాలన చేస్తోందని వివరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం : బండి సంజయ్ - bjp formation day celebrations
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. భాజపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు.
బండి సంజయ్, భాజపా ఆవిర్భావ దినం
భాజపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :భారత్లో మరో 97 వేల మందికి కరోనా