ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల విషయంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన కవిత, వినోద్లకు ఓ న్యాయం.. మాజీ స్పీకర్ మధుసూదనాచారికి మరో న్యాయమా అని ప్రశ్నించారు.
'మధుసూదనా చారికి ఓ న్యాయం.. కవిత, వినోద్‌కు మరో న్యాయమా?' - కల్వకుంట్ల కవితపై భాజపా మాజీ ఎమ్మెల్యే విమర్శలు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఓటు వేసే ముందు ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కవిత, వినోద్ విషయంలో ఓ నిర్ణయం.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి పట్ల మరో నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.
'దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కో'
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసే ఆలోచించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో కవితను నిజామాబాద్ ప్రజలు దారుణంగా ఓడించారని... పట్టుదల ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి భాజపాను ఎదుర్కొని గెలవాలని ఆమెకు సవాల్ విసిరారు. దొడ్డిదారిలో చట్ట సభల్లో అడుగు పెట్టాలని కవిత చూస్తున్నారని, ఇది ప్రజలను అవమాన పరిచినట్టేనని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి:నిర్భయ దోషుల ఉరిశిక్ష కోసం పవన్ ట్రయల్స్
TAGGED:
nizamabad mlc by election