తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్​ను కలిసిన భాజపా ప్రతినిధుల బృందం - tamilisai

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్​కు వివరించేందుకు లక్ష్మణ్‌ నేతృత్వంలో భాజపా ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ఈ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, సంస్థ ఆస్తుల పరిరక్షణ, హైకోర్టులో విచారణ, కార్మికుల జీతాలకు సంబంధించిన అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

గవర్నర్​ను కలిసిన భాజపా ప్రతినిధుల బృందం

By

Published : Oct 16, 2019, 7:22 PM IST

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టును పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం వాదనలు వినిపించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇద్దరు కార్మికులు చనిపోయినా ప్రభుత్వం చర్చలకు పిలువకుండా నియంతృత్వ పోకడలకు పోతుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్​కు వివరించేందుకు లక్ష్మణ్‌ నేతృత్వంలో భాజపా ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ఈ భేటీలో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, సంస్థ ఆస్తుల పరిరక్షణ, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, కార్మికుల జీతాలకు సంబంధించిన అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పట్టపగలే తెరాస దొంగలు ఆర్టీసీ ఆస్థులను దోచుకుంటున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ఎప్పుడులేని విధంగా దసరాకు 22 రోజుల పాటు సెలవులు ప్రకటించి ప్రభుత్వం విద్యార్థుల చదువును నాశనం చేసిందని దుయ్యబట్టారు.

గవర్నర్​ను కలిసిన భాజపా ప్రతినిధుల బృందం
ఇవీ చూడండి: 'ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్​-బ్లాక్​ను కూల్చాల్సిన అవసరమేంటి?'

ABOUT THE AUTHOR

...view details