తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ప్రకటన - ghmc mayor and deputy mayor election 2021

భాజపా మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటి మేయర్ అభ్యర్థిగా బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేర్లను ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రకటించారు. అంతకముందు బషీర్‌బాగ్‌ అమ్మవారి ఆలయంలో భాజపా కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు చేశారు.

భాజపా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ప్రకటన
భాజపా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

By

Published : Feb 11, 2021, 10:30 AM IST

Updated : Feb 11, 2021, 12:07 PM IST

నేడు జీహెచ్​ఎంసీ పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో భాజపా కార్పొరేటర్లు బషీర్​బాగ్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్​ రావు.. భాజపా మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేర్లను ప్రకటించారు.

భాజపా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

పూజల అనంతరం బషీర్​బాగ్ ఆలయం నుంచి భాజపా కార్పొరేటర్లు వెజ్​పార్క్​ హోటల్​కు వెళ్లారు. అక్కడినుంచి జీహెచ్​ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.

Last Updated : Feb 11, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details