గ్రేటర్ ఎన్నికల్లో భాజపా ప్రచార జోరు కొనసాగుతోంది. తార్నాక డివిజన్ అభ్యర్థి జయసుధా రెడ్డి మాణికేశ్వర్ నగర్లో భాజపా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెరాస వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
బల్దియా బరిలో భాజపా ప్రచార హోరు.. ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థన
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార హోరు కొనసాగుతోంది. తార్నాక డివిజన్ భాజపా అభ్యర్థి బండ జయసుధారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
బల్దియా బరిలో భాజపా ప్రచార హోరు
భాజపా గెలిస్తే ప్రజల కోసం ఏం చేస్తారో జయసుధ వివరించారు. తెరాస పాలనలో బస్తీలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. గులాబీ నేతల మాయమాటలకు లొంగవద్దని సూచించారు. బల్దియా బరిలో భాజపాకు ఓటేసి గెలిపించాలని జయసుధ కోరారు.