Somu veerraju on chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు అంశంపై చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై ఆయన స్పందించారు. చంద్రబాబు అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా లవ్ చేస్తారని.. ఆ తర్వాత వదిలేస్తారని వ్యాఖ్యానించారు. ఏపీలో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపంలో భాగంగా.. విజయవాడ అమ్మవారి సన్నిధిలో జపం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
Somu veerraju on chandrababu: చంద్రబాబుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు
Somu veerraju on chandrababu: అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని.. ఆ తర్వాత వదిలేస్తారని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను దేశం మొత్తం గమనించిందన్నారు.
చంద్రబాబుపై సోమువీర్రాజు కామెంట్స్
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను దేశం మొత్తం గమనించిందన్నారు. మోదీ పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. పంజాబ్ ఘటనపై ఇవాళ ఏపీ గవర్నర్ను కలుస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :CBN Video: జనసేనతో తెదేపా పొత్తుపై.. చంద్రబాబు చమత్కారం..
Last Updated : Jan 7, 2022, 9:03 PM IST