తెలంగాణ

telangana

ETV Bharat / city

వారిలాగే వైకాపా నేతలు దొరికిపోవడం ఖాయమన్న విష్టువర్దన్ రెడ్డి - ఆంద్రప్రదేశ్ తాజా వార్తలు

Vishnu Vardhan reddy Comments on ycp leaders దిల్లీ మద్యం కుంభకోణంలోఆమ్ఆద్మీ నేతలు దొరికినట్టుగా, వైకాపా నేతలు దొరికిపోతారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్టువర్దన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పూర్తిగా మాఫియాతో నిండిపోయిందని అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు వాస్తవాలను ప్రస్తావిస్తే వైకాపా నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు.

విష్టువర్దన్ రెడ్డి
విష్టువర్దన్ రెడ్డి

By

Published : Aug 22, 2022, 10:36 PM IST

Vishnu Vardhan reddy Comments on ycp leaders: దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు దొరికినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోనూ వైకాపా నేతలు దొరకడం ఖాయమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం, ప్రజలను మోసగించడమేనని విమర్శించారు.

వారిలాగే వైకాపా నేతలు దొరికిపోవడం ఖాయమన్న విష్టువర్దన్ రెడ్డి

వైకాపా మంత్రులు జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాథ్​ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక గనులు, భూములు, మద్యం మాఫియాతో నిండిపోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ వాస్తవాలను ప్రస్తావిస్తే వైకాపా నేతలకు ఉలుకెందుకని నిలదీశారు. వైకాపా పాలనలో పేదల సొమ్ములు దోచుకున్నారే తప్ప.. వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details