జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా ప్రకటించింది. తొలి జాబితాను 21 మందితో విడుదల చేయగా.... రెండో జాబితాను 18 మంది అభ్యర్థులతో, మూడో జాబితాను 34 మందితో విడుదల చేశారు. ప్రస్తుతం నాలుగో జాబితాను 56 మందితో ప్రకటించారు.
56 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన భాజపా - భాజపా అభ్యర్థుల జాబితా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను ఏరికోరి ఎంపిక చేస్తున్నాయి. తాజాగా... భాజపా తన నాలుగో జాబితాను విడుల చేసింది. ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాగా... పూర్తి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
56 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన భాజపా
వీటితో కలిపి మొత్తంగా 150 మందికి గానూ.... ఇప్పటికి 129 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మరో 21 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రటించనున్నారు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడం వల్ల ఉదయం 11 గంటల కల్లా మిగిలిన 21 స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నాలుగో జాబితాలోనే అభ్యర్థులు...
- కాప్రా - వినోద్
- ఎ.ఎస్.రావు నగర్ - ఎం. చంద్రిక
- చర్లపల్లి - సురేందర్ గౌడ్
- మీర్‌పేట హెచ్.బి.కాలనీ - బంగి జయలక్ష్మి
- మల్లాపూర్ - మల్లికార్జున్ గౌడ్
- నాచారం - అనితా పద్మారెడ్డి
- చిలకానగర్ - శైలజా శ్రీకాంత్
- హబ్సిగూడ – చేతన హరీశ్
- ఉప్పల్ - డా.శిల్పారెడ్డి
- వనస్థలిపురం - వెంకటేశ్వర్‌రెడ్డి
- హస్తినాపురం - సుజాత
- మూసారాంబాగ్ - బి.భాగ్యలక్ష్మి
- ఓల్డ్ మలక్‌పేట – కనకబోయిన రేణుక
- చావ్‌ని - ఎరుకల అభిషేక్ గౌడ్
- తలాబ్‌చాచలం - కొత్తపల్లి రేణుక
- గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి
- సంతోష్‌నగర్ - యశ్వంత్ జైశ్వాల్
- బార్కాస్ - వై.విజయలక్ష్మి
- ఫలక్‌నుమా - గగులోత్ మహేందర్
- నవాబ్ సాహెబ్ కుంట – ప్రజ్వల గౌడ్
- జహనూమా - ఎ.శ్రీహరి
- కిషన్‌బాగ్ - బందర్ నవీన్‌కుమార్
- రాజేంద్రనగర్ - అర్చన
- అత్తాపూర్ - సంగీత
- వెంగళరావునగర్ - కె.మనోహర్
- ఎర్రగడ్డ – ప్రసన్న
- భారతీనగర్ - జి.అంజిరెడ్డి
- రామచంద్రాపురం - జి.సత్యనారాయణ
- పటాన్‌చెరు - ఆశిష్ గౌడ్
- కేపీహెచ్‌బీ కాలనీ - ప్రీతం రెడ్డి
- బాలాజీనగర్ - అరిటాకుల చారుమతి
- అల్లాపూర్ - పులిగోళ్ల లక్ష్మి యాదవ్
- మూసాపేట్ - మహేందర్
- ఫతేనగర్ - కృష్ణ గౌడ్
- ఓల్డ్ బోయినపల్లి - తిరుపతి యాదవ్
- బాల్‌నగర్ - నర్సిరెడ్డి
- కూకట్‌పల్లి - నాయిని పవన్
- గాజులరామారం - శ్రీధర్ వర్మ
- జగద్గిరిగుట్ట – శ్రీమహేష్ యాదవ్
- రంగారెడ్డినగర్ - నందనం దివాకర్
- చింతల్ - పి.శ్రుతి
- సూరారం - బక్కా శంకర్‌రెడ్డి
- సుభాష్‌నగర్ - మాలతిరెడ్డి
- కుత్బుల్లాపూర్ - ఉక్కంటి స్వాతి
- జీడిమెట్ల – తారా చంద్రారెడ్డి
- మచ్చబొల్లారం - సర్వే నరేష్
- అల్వాల్ - కె. వీణా గౌడ్
- వెంకటాపురం - జి.శివ అభిషేక్
- నేరేడ్‌మెట్ - ప్రసన్న
- వినాయకనగర్ - సి.రాజ్యలక్ష్మి
- బన్సీలాల్‌పేట – స్పందన
- మౌలాలి - సునీత శేఖర్ యాదవ్
- ఈస్ట్ ఆనంద్‌బాగ్ - బక్కా నాగరాజ్
- మల్కాజిగిరి - వి.శ్రావణ్
- గౌతంనగర్ - సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్