కండక్టర్ సురేందర్ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి - ఆర్టీసీ కండక్టర్ సురేందర్ భౌతికకాయానికి భాజపా నేతల నివాళి
ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం... కార్వాన్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. భాజపా, తెదేపా నేతలు సురేందర్ భౌతికకాయానికి నివాళి అర్పించి...సంతాపం తెలిపారు.
ఆదివారం రోజు హైదరాబాద్ కార్వాన్లో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కండక్టర్ సురేందర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు బందో బస్తు మధ్య కార్వాన్‌లోని ఇంటికి సురేందర్ భౌతిక కాయాన్ని తరలించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ.. సురేందర్ పార్థివదేహానికి నివాళి అర్పించి... సంతాపం తెలిపారు.
- ఇదీ చూడండి : శ్రీనివాస్ రెడ్డి మృతిపై జనసేనాని స్పందన
TAGGED:
tsrtc strike in hyderabad