తెలంగాణ

telangana

ETV Bharat / city

HCU: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా బీజే రావు - telangana varthalu

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ బీజే రావు నియమితులయ్యారు. ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు ప్రస్తుతం తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జీవశాస్త్రం విభాగాధిపతిగా ఉన్నారు. ప్రొఫసర్ బీజే రావును హెచ్​సీయూ వీసీగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

HCU: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా బీజే రావు నియామకం
HCU: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా బీజే రావు నియామకం

By

Published : Jul 24, 2021, 6:54 AM IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ప్రొఫెసర్‌ బసుత్కర్‌ జగదీశ్వర్‌రావు (బీజే రావు) నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌(ఐసెర్‌), తిరుపతిలో ఫ్యాకల్టీ డీన్‌, బయోలజీ విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. హెచ్‌సీయూ ఉపకులపతిగా ఉన్న ప్రొ.పొదిలె అప్పారావు రెండు నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవడంతో అరుణ్‌ అగర్వాల్‌ వీసీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం హెచ్‌సీయూకు బీజేరావును రెగ్యులర్‌ వీసీగా నియమించింది.

బీజే రావు స్వస్థలం మహబూబ్‌నగర్‌. హైదరాబాద్‌ నిజాం కళాశాలలో బీఎస్సీ, ఓయూలో ఎమ్మెస్సీ చదివారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (బెంగళూరు)లో పీహెచ్‌డీ చేశారు. యాల్‌ (వైఏఎల్‌ఈ) మెడికల్‌ స్కూల్‌లో ఏడేళ్లపాటు రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా పనిచేశారు. టీఐఎఫ్‌ఆర్‌లో ఆచార్యునిగా పనిచేశారు. విద్యార్థుల సంక్షేమం, అధ్యాపకుల నైపుణ్యం పెంపు, పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సరికొత్త మార్గంలో వర్సిటీని నడిపించనున్నట్లు ప్రొ.బీజే రావు చెప్పారు. హెచ్‌సీయూ సహా దేశంలో 12 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదం తెలిపారు.

మనూ వీసీగా ఎస్‌ఏ హసన్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) ఉపకులపతిగా ప్రొ.సయ్యద్‌ అయినుల్‌ హసన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పర్షియన్‌ అండ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ స్టడీస్‌ విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. అఖిల భారత పర్షియన్‌ స్కాలర్స్‌ సంఘం అధ్యాపకుడిగా ఉన్నారు.

కర్ణాటక సెంట్రల్‌ వర్సిటీ వీసీగా ఓయూ మాజీ ఆచార్యుడు

కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీగాతెలుగు వ్యక్తి ప్రొ. భట్టు సత్యనారాయణకు అవకాశం దక్కింది. గతంలో ఉస్మానియా వర్సిటీ రసాయనశాస్త్ర అధిపతిగా పనిచేశారు. ఓయూ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, ఎంజీ, శాతవాహన వర్సిటీ ఫ్యాకల్టీ డీన్‌గా వ్యవహరించారు. ఉస్మానియా టీచర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల టీచర్స్‌ సమాఖ్య ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 సెప్టెంబరులో ఆచార్యునిగా ఉద్యోగ విరమణ చేశారు.

ఇదీ చదవండి: ఉద్యోగ నియామకాలు, పదోన్నతులన్నింటికీ కొత్త జిల్లాలే ప్రాతిపదిక

ABOUT THE AUTHOR

...view details