తెలంగాణ

telangana

Birthday wishes to CBN: చంద్రబాబుకు బర్త్​డే విషెస్ చెప్పిన లోకేష్​, పవన్

By

Published : Apr 20, 2022, 3:10 PM IST

Birthday wishes to CBN: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా.. ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్​కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Birthday wishes to CBN: చంద్రబాబుకు బర్త్​డే విషెస్ చెప్పిన లోకేష్​, పవన్
Birthday wishes to CBN: చంద్రబాబుకు బర్త్​డే విషెస్ చెప్పిన లోకేష్​, పవన్

Birthday wishes to CBN: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదవగలిగారని లోకేష్​ పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి చంద్రబాబు అన్నదాత అయ్యారని తెలిపారు. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే తన కుటుంబం చేసుకుని.. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సూపర్​స్టార్ చంద్రబాబు అన్నారు.

జన సేనాని శుభాకాంక్షలు..తెదేపా అధినేత చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details