తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR BIRTHDAY: మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ - telangana varthalu

మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ​ మొక్కలు నాటారు.

KTR BIRTHDAY: మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
KTR BIRTHDAY: మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

By

Published : Jul 24, 2021, 11:51 AM IST

Updated : Jul 24, 2021, 12:14 PM IST

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కేటీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలకతీతంగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కోరారు. శాసనమండలి సభ్యులందరి తరఫున ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌ రెడ్డి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌ రావు... కేటీఆర్​ ఆరోగ్యంగా జీవించాలని ఆకాక్షించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ హాజరుకానున్నారు.

మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటారు. ముందుగా జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి అజయ్​ మొక్క నాటి... కేక్‌ కట్‌చేసి మీఠాయిలు పంచారు. నగరంలోని దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు 'స్మైల్‌ ఏ గిఫ్ట్‌'గా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

వేడుకల్లో దానం

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ప్రముఖమైనదని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ట్యాంక్​బండ్ పీపుల్స్​ ప్లాజా వద్ద దానం మొక్కలను నాటారు. నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కేటీఆర్.. స్మైల్ ఏ గిఫ్ట్ పేరుతో సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. అందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 25 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసినట్లు దానం తెలిపారు.

బృహత్తర కార్యక్రమం

ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్​లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్​ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటి.. రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఘనంగా వేడుకలు

ఆదిలాబాద్​లో ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మంత్రి కేటీఆర్​ జన్మదినం నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే దివాకర్​రావు తెరాస శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఆర్కే-6 బొగ్గు గని ఆవరణలో కార్మికులు, కార్మిక నాయకులు కేటీఆర్​ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఉత్సాహంగా ముక్కోటి వృక్షార్చన

వరంగల్​లో వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. హన్మకొండలోని చింతగట్టు వద్ద వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మొక్కలను నాటారు. రాష్టం ఆకుపచ్చ తెలంగాణగా మారాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వారు కోరారు.

ఎంపీ సంతోష్​కుమార్​ స్వగ్రామంలో..

రాజ్యసభ సభ్యుడు జోగినపళ్లి సంతోష్ కుమార్ స్వగ్రామమైన కరీంనగర్​ జిల్లాలోని కొదురుపాకలో తెరాస రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన నిర్వహించారు. సిరిసిల్ల - కరీంనగర్ రహదారిలో బోయినపల్లి మండలం కొదురుపాక నాలుగు వరుసల రహదారి మధ్యలో మొక్కలు నాటారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్​ రావుతో కలిసి గుత్తా సుఖేందర్​రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Guru Purnima : గురుపరంపరకు ఆద్యుడు.. వ్యాసభగవానుడు

Last Updated : Jul 24, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details