జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జీహెచ్ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పునర్ వ్యవస్థీకరించిన ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ బాధ్యతలను కేటాయించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తు స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని గ్రేటర్ సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీసేవా కేంద్రాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.
పుట్టిన, మరణించిన 30 రోజుల్లోపు చేసుకునే దరఖాస్తుల పరిశీలన.. జారీచేసే అధికారాన్ని ఏఎంసీలకు అప్పగించారు. నెల తరువాత నుంచి ఏడాది వరకు సమయంలో వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రార్లుగా ఉండే ఏఎంహెచ్ఓలు పరిశీలించి జారీ చేస్తారు. ప్రస్తుతం వార్డు యూనిట్‌గా ఉన్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సర్కిల్ యూనిట్‌గా మారుతూ ఈ జనవరి 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది.