Bike caught fire: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన మానవహారంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సారథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం చోడవరం కూడలిలో మానవహారం చేపట్టారు.
ర్యాలీలో అపశృతి.. బైక్పై పెట్రోల్ పోసి తనపై పోసుకున్న కార్యకర్త.. చివరికి..! - అనకాపల్లిలో వైకాపా ర్యాలీలో బైక్ దగ్ధం
Bike caught fire: ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో వైకాపా నిర్వహించిన మానవహారంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బైక్పై పెట్రోల్ పోయడమే కాకుండా.. తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఈలోగా అక్కడ ఉన్నవాళ్లు అతన్ని దూరం తీసుకెళ్లారు. ఈలోగా హఠాత్తుగా బైక్కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.
![ర్యాలీలో అపశృతి.. బైక్పై పెట్రోల్ పోసి తనపై పోసుకున్న కార్యకర్త.. చివరికి..! Bike caught fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16635462-1073-16635462-1665661086814.jpg)
Bike caught fire
ర్యాలీలో అపశృతి.. బైక్పై పెట్రోల్ పోసి తనపై పోసుకున్న కార్యకర్త.. చివరికి..!
ఈ మధ్యలో పి.ఎస్.పేటకు చెందిన సి.హెచ్. శ్రీనివాస్ తన బైకును మానవహారం మధ్యలో పడేసి.. పెట్రోల్ పోసి తనపైనా పెట్రోల్ పోసుకున్నాడు. ఆ యువకుడిని ధర్మశ్రీ, కార్యకర్తలు నివారించి వెనక్కి లాగేశారు. ఈలోగా బైక్కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో వైకాపా కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: