తెలంగాణ

telangana

ETV Bharat / city

బిగ్​బాస్​ సోహెల్ దాతృత్వం.. 10 లక్షల విరాళం - నటుడు సోహెల్ విరాళం

'కథ వేరే ఉంటది' అంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ.. ఓ టెలివిజన్ రియాల్టీ షోలో పాల్గొన్న నటుడు సోహెల్. తాను గెలుచుకున్న నగదు బహుమతిలో రూ.10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చి మరోసారి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

bigboss sohel checks distribution at pressclub in hyderabad
బిగ్​బాస్​ సోహెల్ దాతృత్వం.. 10 లక్షల విరాళం

By

Published : Jan 11, 2021, 5:43 PM IST

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నటుడు సోహెల్ కోరారు. ఓ టెలివిజన్ రియాల్టీ షోలో గెలుచుకున్న నగదు బహుమతిలో రూ.10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చి సోహెల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో ఆయా సంస్థలకు చెక్కులను అందించారు.

చౌటుప్పల్​లోని అమ్మానాన్న అనాథశ్రమం, నేరేడ్​మెట్​లోని మదర్ నెస్ట్, రామగుండంలోని తబితా స్వచ్ఛంద సేవా సంస్థ, ఆర్టీసీ క్రాస్​రోడ్​లోని పీపుల్స్ స్వచ్ఛంద సంస్థకు చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లిలోని తన బంధువులలో ముగ్గురు దివ్యాంగ యువతులకు ఆర్థిక సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తానని సోహెల్ తెలిపారు.

ఇదీ చూడండి:అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్న బోయిన్​పల్లి పోలీసులు

ABOUT THE AUTHOR

...view details