తెలంగాణ

telangana

ETV Bharat / city

50 కేజీల అరుదైన 'పందుగ' చేప - అరుదైన పందుగ చేప

వరద నీరు భారీగా కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. నదీ ప్రవాహంతో కొట్టుకువస్తోన్న అరుదైన చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతున్నాయి. తాజాగా ఏపీలోని కృష్ణా నదిలో 40 నుంచి 50 కేజీల బరువైన భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కింది. 4 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ చేపను పందుగ అని పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

big-fish-in-srisailam-kurnool-district
50 కేజీల అరుదైన 'పందుగ' చేప

By

Published : Aug 27, 2020, 12:52 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడం వల్ల వారం రోజుల నుంచి జలాశయం గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం దిగువ భాగాన ఉన్న లింగాల గట్టు గ్రామం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కుతున్నాయి.

తాజాగా కృష్ణా నదిలో 40 నుంచి 50 కేజీల బరువైన భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కింది. 4 అడుగుల పొడవు కలిగిన ఈ భారీ చేపను పందుగ అని పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చేప దొరకడం ఇదే తొలిసారి. శ్రీశైలం జలాశయానికి వరద పెరగడం వల్ల మత్స్యకారులు చేపలు అధికంగా పడుతున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే

ABOUT THE AUTHOR

...view details