తెలంగాణ

telangana

ETV Bharat / city

మత్స్యకారులకు చిక్కిన భారీ చేప - మత్స్యకారులకు చిక్కిన భారీ చేప తాజా వార్తలు

ఏపీలోని ఉప్పాడ చేపల రేవులో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. టూనా జాతికి చెందిన ఈ చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు నానా తంటాలు పడ్డారు. చాలా కాలం తర్వాత ఇంత భారీ చేప తమ వలకు చిక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

మత్స్యకారులకు చిక్కిన భారీ చేప
మత్స్యకారులకు చిక్కిన భారీ చేప

By

Published : Feb 18, 2021, 10:56 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో మత్స్యకారులకు భారీ చేప లభించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆరడుగుల పొడవుగల ఎనభై కిలోల బరువున్న టూనా జాతి చేప వలకు చిక్కింది.

చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. ఆ చేపను అమ్మేందుకు బహిరంగ వేలం నిర్వహించగా.. ఓ వ్యాపారి రూ. 8,500 చెల్లించి కొనుగోలు చేశాడు. చాలా కాలం తర్వాత ఇంత భారీ చేప తమ వలకు చిక్కిందంటూ.. మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:'ఉప్పెన విజయం.. మెగాస్టార్ చిరంజీవికి అంకితం'

ABOUT THE AUTHOR

...view details