తెలంగాణ

telangana

ETV Bharat / city

Hyderabad Metro : 'మెట్రో ప్రయాణికులారా.. బిగ్​బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు'

ప్రజలకు ఏదైనా విషయంపై అవగాహన కల్పించాలంటే.. ఎంటర్​టైన్​మెంట్(entertainment) మాధ్యమమే సరైన ఛాయిస్. ఏ విషయమైనా ఎంటర్​టైనింగ్​గా చెబితే.. జనాల్లోకి ఈజీగా వెళ్తుంది. ఇదే ఫార్ములాను ఎంచుకుంది హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro). ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించేందుకు స్టార్​ మా(Star Maa)తో జతకట్టింది. ఆ ఛానల్​లో ప్రసారమయ్యే ఓ ఫేమస్​ షోను మాధ్యమంగా చేసుకుంది. ఇంతకీ ఆ షో ఏంటి? మెట్రోకి.. ఆ ప్రోగ్రామ్​కి సంబంధమేంటో చదివేయండి మరి..

Hyderabad Metro
Hyderabad Metro

By

Published : Nov 14, 2021, 9:55 AM IST

హైదరాబాద్​లో మెట్రో(Hyderabad Metro) వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సులువైంది. ట్రాఫిక్ రద్దీ(Traffic Jam), రణగొణధ్వనులు ఏం లేకుండా.. హాయిగా మెట్రోలో కూర్చుని.. ఇలా కునుకు తీస్తే.. అలా గమ్యస్థానం వచ్చేస్తోంది. సాఫీగా సాగే మెట్రో ప్రయాణం(Metro journey)లోనూ కొన్ని అడ్డంకులు ఉంటున్నాయి. స్త్రీలకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చోవడం.. కరోనా వ్యాప్తి చెందుతున్నా నిబంధనలు(corona rules violation) పాటించకపోవడం.. ప్రయాణికుల భద్రత(passengers safety)లో లోటుగా మారాయి. ఇదంతా గమనిస్తున్న మెట్రో సంస్థ(Hyderabad metro).. ప్రయాణికుల భద్రతపై అవగాహన పెంచాలని ఫిక్స్ అయింది.

సాధారణంగా అవగాహన కార్యక్రమాలంటే.. ప్రజల్లో ఒకింత నిరాసక్తత. అది వాళ్ల మంచికే చెబుతున్నా.. ఏదో ఊదర కొడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు. అందుకే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) కాస్త ట్రెండీగా ఆలోచించింది. నేటి తరానికి తలకెక్కే విధంగా ఓ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్​ను అమలు చేయడానికి ఓ సూపర్ వెపన్​ను ఎంచుకుంది. ఆ ఆయుధమే ఎంటర్​టైన్​మెంట్(Entertainment).

ఏ విషయమైన ఎంటర్​టైనింగ్​గా చెబితే.. ఈజీగా అర్థమవుతుంది. ట్రెండీగా ఉంటేనే నేటి తరం దాన్ని ఫాలో అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకున్న ఎల్​అండ్​టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి(L&T Hyderabad Metro MD KVB Reddy).. ఎంటర్​టైన్​మెంట్​ను ప్రధాన ఆయుధం చేసుకుని.. స్టార్​మా ఛానల్(Start Channel)​తో జతకట్టారు. ఈ ఛానల్​ ప్రసారమవుతున్న ఫేమస్‌ షో బిగ్​బాస్(Telugu Big Boss show)​ను ప్రయాణికుల భద్రతపై అవగాహన పెంచడానికి ఉపయోగించాలని నిర్ణయించింది.

‘మీరు మెట్రో(Hyderabad Metro)లో ప్రయాణిస్తూ మాస్క్‌ తీసి ఫోన్‌(mask removal)లో మాట్లాడుతున్నారా? మహిళలు వచ్చినా వారికి కేటాయించిన సీట్లు ఇవ్వకుండా పురుషులు కూర్చుకుంటున్నారా? మిమ్మల్ని బిగ్‌బాస్‌(Big Boss announcement in Hyderabad metro) గమనిస్తున్నాడనే విషయాన్ని మరవకండి’ అంటూ మెట్రోలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల పాటించాల్సిన కనీస విషయాలపై అవగాహన కల్పించేందుకు ఎల్‌అండ్‌టీమెట్రో, స్టార్‌ మా జతకట్టాయి.

అన్నపూర్ట స్టూడియోలో(Annapurna studios)ని బిగ్‌బాస్‌ సెట్‌(Telugu Big Boss set)లో జరిగిన కార్యక్రమంలో బిగ్‌బాగ్‌ వ్యాఖ్యాత నాగార్జున(Big Boss host Nagarjuna), ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి(L&T Hyderabad Metro MD KVB Reddy) ‘బిగ్‌బాస్‌ మిమ్మల్ని గమనిస్తున్నాడు(Big Boss is observing)’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమం 100 రోజులు కొనసాగనుంది. ప్రయాణికుల భద్రత(passengers' safety)పై మరింత అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని నాగార్జున అన్నారు. కొవిడ్‌ అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, మొబైల్‌ క్యూఆర్‌ కోడ్‌ టిక్కెట్లు, స్మార్ట్‌ కార్డుల వినియోగం పెంచే దిశగా అవగాహన కొనసాగుతుందని కేవీబీరెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details