కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బోయిన్పల్లి పీఎస్కు హాజరై ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. తమ విచారణకు ఆమె సహకరించినట్లు ఏసీపీ తెలిపారు.
బోయిన్పల్లి పీఎస్కు అఖిలప్రియ.. గంటన్నరపాటు విచారణ - Bowenpally Police station
ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆదేశానుసారం ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు.

బోయిన్పల్లి పీఎస్కు అఖిలప్రియ
ఉదయం పది గంటలకు బోయిన్పల్లి పీఎస్కు వెళ్లిన అఖిలప్రియ.. గంటన్నరపాటు స్టేషన్లోనే ఉండి విచారణకు సహకరించారు. ప్రతి 15 రోజులకోసారి పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరో నిందితుడు భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి :చంచల్గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల