దుబ్బాకలో ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు... భువనగిరి ఎంపీ కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు లేఖను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దుబ్బాకలో ఎన్నికల నియమావళిని అధికారంలో ఉన్న తెరాస, భాజపా ఉల్లంఘిస్తున్నాయని... హరీశ్ రావు విపక్ష పార్టీల్లో భయాలు సృష్టిస్తూ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి - భువనిగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీఈసీకి లేఖ
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకొని ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
కేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి
ఎన్నికలు పారదర్శకంగా జరగటానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లఘిస్తున్న తెరాస, భాజపా నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కేంద్ర బలగాలను మోహరించి, మండలానికి ఒక కేంద్ర పరిశీలకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసులను, జిల్లా అధికార యంత్రాగాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవద్దని, ఇతర జిల్లాల అధికారులను ఉపయోగించుకోవాలని వివరించారు.
ఇదీ చూడండి:సచివాలయ పనులు షాపూర్జీ పల్లోంజీకే..
Last Updated : Oct 29, 2020, 7:42 PM IST