Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో 'అమరావతి ఉద్యమ సెగలు' పేరుతో రైతులు భోగిమంటలు వేశారు. అమరావతికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.
Bhogi Mantalu at Mandadam: అమరావతి ఉద్యమ సెగలు... భోగి మంటల్లో జీవో ప్రతులు - అమరావతి ఉద్యమ సెగలు పేరుతో రైతుల భోగిమంటలు
Amaravati Udyama Segalu: సంక్రాంతి సందర్భంగా ఏపీలో అమరావతి ఐకాస నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మందడంలో అమరావతి ఉద్యమ సెగలు పేరుతో రైతులు భోగిమంటలు వేశారు.
అమరావతి ఉద్యమ సెగలు
Bhogi Mantalu at Mandadam: ఈ కార్యక్రమంలో 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రజాగాయకుడు రమణ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందంటూ.. రమణ ఆలపించిన గేయాలకు రైతులు నృత్యాలు చేశారు. తెదేపా నేత శ్రవణ్ రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి :Rain Effect on Mango Orchards : వడగండ్ల వానొచ్చె.. మామిడి పూత రాలిపాయె..