తెలంగాణ

telangana

ETV Bharat / city

అంధకారంలో అవార్డులు పొందిన ఆసుపత్రి.. చీకట్లోనే వైద్యం - Bhogapuram Hospital suffered power cut patients

ఏపీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఆ ఆసుపత్రి నేడు అంధకారంలో కూరుకుపోయింది. తద్వారా చికిత్స కోసం వచ్చిన రోగులు, గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికారులు విద్యుత్​ సరఫరా నిలిపివేయడమే.

ఆసుపత్రి
ఆసుపత్రి

By

Published : Sep 9, 2022, 7:03 PM IST

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రాంతీయ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి చీకటిలో సిబ్బంది వైద్యం అందించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఆసుపత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడమే ఇందుకు ప్రధాన కారణం. పలుమార్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఈ ఆసుపత్రి.. నేడు అంధకారంగా మారింది.

ఆసుపత్రికి అవార్డులతో పాటు లక్షల్లో రివార్డులు వస్తున్న అవన్నీ పక్క దారి పట్టిస్తున్నారని.. అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో రూ.15 లక్షల విలువైన జనరేటర్ రెండేళ్ల క్రితమే అమర్చారని.. కానీ ఇది పాడై నాలుగు నెలలు కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

అంధకారంలో అవార్డులు పొందిన ఆసుపత్రి.. చీకట్లోనే వైద్యం

ABOUT THE AUTHOR

...view details