ట్రావెల్ ఏజెన్సీ మోసం కారణంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భీమవరం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తునికి చెందిన ఉమా ట్రావెల్స్ ఆధ్వర్యంలో గత నెల 29న భీమవరం నుంచి 24 మంది అమర్నాథ్ యాత్రకు బయల్దేరారు. మొదట వారం రోజుల పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో సజావుగా దర్శనాలు జరిగాయి. కానీ శ్రీనగర్ చేరుకున్నాక వాళ్లకు ఇబ్బందులు మొదలయ్యాయి.
ట్రావెల్ ఏజెన్సీ మోసం.. శ్రీనగర్‌లో తెలుగువారి ఇబ్బందులు
Facing Problems with Fake Flight Tickets: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అమర్నాథ్కు వెళ్లేందుకు తునిలోని ఉమా ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లు నకిలీవని తెలియటంతో.. వారు ఆందోళన చెందారు. ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకుల తమను మోసం చేశారని.. ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పట్లేదని వారు వాపోయారు. తమకు సాయం చేయాలని అక్కడి అధికారులను కోరుతున్నారు.
బుధవారం భీమవరం బృందం దిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకుంది. అక్కడినుంచి అమర్నాథ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఉమా ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లు నకిలీవని తెలిసింది. దీంతో వారంతా అందోళనకు గురయ్యారు. వెంటనే ఉమా ట్రావెల్స్ ఏజెన్సీని సంప్రదించారు.. వారు సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు. తునికి చెందిన ఉమా ట్రావెల్స్ నిర్వాహకుడు దేవరకొండ శ్రీనివాస్ మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాము శ్రీనగర్ హోటల్స్‌లో ఉంటున్నామన్నారు. తాము అమర్నాథ్కు వెళ్లేందుకు సాయం చేయాలని శ్రీనగర్ అధికారులను కోరుతున్నారు. అలాగే తమను మోసం చేసిన ఉమా ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: