కరోనా సమయంలో ఆ ఎమ్మెల్యే ఆలోచన... ప్రజలను మరింత చేరువ చేసింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సరికొత్త ఆలోచనతో ప్రజలతో మమేకమవుతున్నారు.
ఆ ఎమ్మెల్యే ఐడియా అదుర్స్ గురూ! - ఆ ఎమ్మెల్యే ఐడియా అదుర్స్ గురూ!
కరోనా సమయంలో ఆ ఎమ్మెల్యే ఆలోచన... ప్రజలను మరింత చేరువ చేసింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన ఆలోచనతో ప్రజలతో మమేకమవుతున్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. కోవిడ్ వైరస్ సోకకుండాఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆకర్షిస్తుంది.
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన దగ్గరికి వచ్చిన ప్రజలను కలుసుకోవడానికి తన కార్యాలయం బయట మోనిటర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేని మోనిటర్లో చూస్తూ స్వయంగా ప్రజలు తమ సమస్యలను చెప్పవచ్చు. ఆయన గదిలో ఉండి మరొక మోనిటర్ స్పీకర్ ద్వారా సమాధానం ఇస్తుంటారు.
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయానికి ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భీమవరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికి లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ ఆలోచన అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయంగా మారింది.