తెలంగాణ

telangana

ETV Bharat / city

'అధికార తెరాస పార్టీకి చుక్కలు చూపిద్దాం' - కాంగ్రెస్​లో చేరిన తెజస సిద్దిపేట భవాని రెడ్డి

సిద్దిపేటకు చెందిన తెజస నాయకురాలు భవాని రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు మరో 10 మంది అనుచరులు కాంగ్రెస్‌లోకి మారారు. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ ‌రెడ్డి భవానిరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

bhavani-reddy-comments-lets-show-the-do-the-ruling-trs-party
'అధికార తెరాస పార్టీకి చుక్కలు చూపిద్దాం'

By

Published : Aug 14, 2020, 5:26 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఎప్పుడూ తానూ భయపడలేదని భవాని రెడ్డి పేర్కొన్నారు. ఇప్పడు నాకు కొత్తగా అడిగిన వెంటనే ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీకి ఆమె ధన్యవాదాలు చెప్పారు. అధికార తెరాస పార్టీకి చుక్కలు చూపిద్దామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక సభ్యురాలిగా కలగలుపుకుని పనిచేసి తెరాసను దీటుగా ఎదుర్కొంటానని కాంగ్రెస్‌ పార్టీలో చేరిన భవాని రెడ్డి తెలిపారు.

ఇవాళ సిద్దిపేటకు చెందిన తెలంగాణ రాష్ట్ర జన సమితి నాయకురాలు, మరో పది మంది ఆమె అనుచరులకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యావంతురాలు భవాని రెడ్డికి కాంగ్రెస్‌ అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

భవానిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్దమై కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం చాలా సంతోషమని జగ్గారెడ్డి తెలిపారు. ఉత్తమ్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details