తెలంగాణ

telangana

ETV Bharat / city

బడ్జెట్​లో​ రాబడి తగ్గింది.. అప్పు పెరిగింది: కాంగ్రెస్​ - BUDGET

తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవానికి దూరంగా ఉందని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అవగాహన లోపం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే అప్పులు పెరిగాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ మిగులు బడ్జెట్‌ ఫలాలు తెరాస పాలనలో ఐదేళ్ల వరకు కొనసాగాయన్నారు.

బడ్జెట్​లో​ రాబడి తగ్గింది.. అప్పు పెరిగింది: కాంగ్రెస్​

By

Published : Sep 9, 2019, 6:22 PM IST

శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌... చేతులెత్తేసిన బడ్జెట్‌లా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. వాస్తవానికి దూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పొదం వీరయ్య, సీతక్కలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవగాహన లోపం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని దుయ్యబట్టారు. ఆర్మూర్‌లో ఓసభకు వెళ్తున్న సోయం బాబురావును గృహనిర్భందం చేశారని ఇంతకంటే శోచనీయ ఘటన మరొకటి లేదని ఎమ్మెల్యే వీరయ్య మండిపడ్డారు. తెరాసది కోతల బడ్జెట్‌గా ములుగు ఎమ్మెల్యే సీతక్క అభివర్ణించారు. గత ప్రభుత్వ మిగులు బడ్జెట్‌ ఫలాలు తెరాసలో ఐదేళ్ల వరకు కొనసాగాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబడి తగ్గిందని... అది కప్పిపుచ్చుకునేందుకే అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బడ్జెట్​లో​ రాబడి తగ్గింది.. అప్పు పెరిగింది: కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details